పున‌ర్న‌వి భూపాలం ఫూల్స్‌ని చేసిందిగా!

పున‌ర్న‌వి భూపాలం ఫూల్స్‌ని చేసిందిగా!
పున‌ర్న‌వి భూపాలం ఫూల్స్‌ని చేసిందిగా!

గురువారం త‌న‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, 30న పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తాన‌ని సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. రింగ్ తొడిగి వున్న పూన‌ర్ణ‌వి చేతిని మ‌రో వ్య‌క్తి ప‌ట్టుకున్న ఫొటోని షేర్ చేస్తూ `ఫైన‌ల్లీ ఇట్స్ హ్యాపెన్‌` అని షేర్ చేసింది. దీంతో అంతా పూన‌ర్ణ‌వి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, ఇక త్వ‌ర‌లో పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని అంతా అపోహ‌ప‌డ్డారు.

ఇంత‌కీ పున‌ర్న‌విని పెళ్లాడే వ‌రుడు ఎవ‌రా అని ఆరాతీశారు. అత‌ను యూట్యూబ‌ర్ `చికా గో సుబ్బారావు` అంటూ ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే పున‌ర్న‌వి చెప్పింది అంతా అబ‌ద్ధం అని తేలింది. పున‌ర్నవి తన నిశ్చితార్థం జరిగిందని ప్రకటించి అందరినీ మోసం చేసింది. అయితే పున‌ర్న‌వి చేసింది డిజిట‌ల్ ఎంట్రీ కోస‌మేన‌ని తేలింది.

ఆహా కోసం పున‌ర్న‌వి న‌టించిన వెబ్ సిరీస్  ‘కమిట్-మెంటల్’. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని శుక్ర‌వారం రిలీజ్ చేశారు. రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ వెబ్ డ్రామా లో ‘చికాగో సుబ్బారావు’ గా పాపుల‌ర్ అయిన‌ ఉద్భవ్ రఘునందన్ న‌టిస్తున్నాడు. నవంబర్ 13 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.