బయటనుండి రాహుల్ కు క్యాంపైనింగ్ మొదలుపెట్టిన పునర్నవి

Rahul Punarnavi
Rahul Punarnavi

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ లో పునర్నవి భూపాళం కూడా ఒకరు. ఆమె 11వ వారం ఎలిమినేట్ అయింది. పెద్దగా టాస్క్ లలో పాల్గోని పునర్నవి అసలు ఇంత కాలం హౌజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. వరుణ్, వితిక, రాహుల్ లతో టీంగా ఫార్మ్ అయిన తర్వాత పునర్నవి బలపడింది. నామినేషన్స్ లో ఉంటే వరుణ్, రాహుల్, వితిక ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్ తో సేవ్ అవుతూ వచ్చింది.

అయితే లాస్ట్ వీక్ వరుణ్, రాహుల్ లు కూడా పునర్నవితో పాటు నామినేషన్స్ లో ఉండడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు. అయితే హౌజ్ నుండి బయటకు వచ్చినా కానీ పున్ను, వారి గ్రూప్ కు సపోర్ట్ చేస్తోంది. వరుణ్, వితిక, రాహుల్ లు నామినేట్ అయినా కానీ వితిక మెడలియన్ ద్వారా ఇమ్మ్యూనిటి పొందిన విషయం తెల్సిందే.

పునర్నవి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ చివరికి వచ్చేస్తోంది కాబట్టి ఇకనుండి ఎలిమినేషన్స్ చాలా టఫ్ అవ్వనున్నాయని పున్ను చెప్పింది. నాలుగైదు ఓట్ల తేడాతో కూడా ఎలిమినేట్ అవ్వొచ్చని, నా విషయంలో అదే జరిగింది. సో, ఈసారి నామినేషన్స్ లో ఉన్న రాహుల్, వరుణ్ లకు ఓట్లు వేయండి అని తన మెసేజ్ చెప్పింది. అయితే నామినేషన్స్ లో ఉన్న మహేష్ విట్టా గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం గమనార్హం. అసలు అతని ప్రస్తావనే తీసుకురాలేదు.