రాహుల్ పునర్నవికి ప్రపోజ్ చేస్తే..? పున్నుకు ఆసక్తికర ప్రశ్న

punarnavi clarifies her relation with rahul sipligunj
punarnavi clarifies her relation with rahul sipligunj

బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో బంధాలు ఏర్పడడం, ఒకరితో ఒకరు క్లోజ్ గా మూవ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్ సీజన్ లో సామ్రాట్, తేజస్వి మధ్య ఇలాంటి బంధమే ఏర్పడింది. హౌజ్ లో ఉండగానే ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు బహిరంగంగానే ఒప్పుకున్నారు. అయితే ఒక్కసారి బిగ్ బాస్ అయిపోయాక అలాంటిదేం లేదని తేలిపోయింది.

ఈ సీజన్ లో అలాంటి జంటగా పునర్నవి భూపాళం – రాహుల్ సిప్లిగంజ్ గురించి చెప్పుకోవచ్చు. వీరిద్దరూ హౌజ్ లో ఉన్నన్ని రోజులూ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకరికి ఒకరు గోరు ముద్దలు తినిపించుకున్నారు. పునర్నవి అయితే రాహుల్ ను కిస్ చేసింది. ఇటీవలే పునర్నవి ఎలిమినేట్ అయిపోతే రాహుల్ ఎంతగా బాధపడ్డాడో మనం చూసాం.

ఈ నేపథ్యంలో బయటొచ్చాక వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండనుంది అన్న ప్రశ్నకు సమాధానం పునర్నవి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య ఏం లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే. ఒకవేళ బయటొచ్చాక తను ప్రపోజ్ చేస్తే ఇప్పుడివన్నీ ఎందుకురా అని తిడతాను, హౌజ్ లో ఉన్నప్పుడు కూడా నేను చాలా సార్లు తనని తిట్టాను అని క్లారిటీ ఇచ్చింది పున్ను.