బిగ్ బాస్ పై ఎదురుతిరిగిన పునర్నవి

Punarnavi
బిగ్ బాస్ పై ఎదురుతిరిగిన పునర్నవి

ప్రతీ సీజన్ లో ఒకడుంటాడు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను వ్యతిరేకిస్తూ, అసలు బిగ్ బాస్ నే ప్రశ్నిస్తూ సంచలనం సృష్టిస్తారు. మొదటి సీజన్ లో ఆ వ్యక్తి శివ బాలాజీ కాగా, రెండో సీజన్ లో బాబు గోగినేని ఆ పని చేసాడు. ఇక మూడో సీజన్ వచ్చేసరికి పునర్నవి బిగ్ బాస్ కు ఎదురుతిరిగి సంచలనం సృష్టించింది. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ టాస్క్ లో మొదట తను చంపబడింది అని తెలియగానే పునర్నవి ఇదో చెత్త టాస్క్ అని, బిగ్ బాస్ నే ఈ టాస్క్ ఆడుకోమని చెప్పింది.

ఆ తర్వాత బిగ్ బాస్ వరస్ట్ పెర్ఫార్మెర్స్ గా శ్రీముఖి, మహేష్, పునర్నవిలను ఎంపిక చేయగా పునర్నవి తను అసలు ఏం చేసానని వరస్ట్ పెర్ఫార్మర్ గా బిగ్ బాస్ డిక్లేర్ చేసారో చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ముగ్గురికి షూస్ తడిచే టాస్క్ ఇచ్చినప్పుడు తాను ఏ తప్పు చేయనప్పుడు తాను ఎందుకు షూస్ తుడవాలని పునర్నవి వాదించింది. దీనివల్ల తర్వాతి వారం నామినేట్ అవుతారని చెప్పినా కూడా పునర్నవి తగ్గలేదు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఈ రగడ ఎక్కడిదాకా పోతుందో చూడాలి.