పున్నూ బేబీ రచ్చ మొదలెట్టిందిగా!

పున్నూ బేబీ రచ్చ మొదలెట్టిందిగా!
పున్నూ బేబీ రచ్చ మొదలెట్టిందిగా!

ఉయ్యాలా జంపాల సినిమాతో నటిగా పరిచయమైంది పునర్నవి భూపాళం. ఆ సినిమా పెద్ద విజయం సాధించినా కానీ పునర్నవికి అవకాశాలైతే వెల్లువలా వచ్చి పడిపోలేదు. ఏవో చిన్నాచితకా సినిమాలు చేస్తూ బిగ్ బ్రేక్ కోసం చూస్తోన్న పునర్నవికి బిగ్ బాస్ రూపంలో అది దొరికింది. ఉయ్యాలా జంపాల సినిమాలో పక్కింటమ్మాయిలా కనిపించిన పునర్నవి అలియాస్ పున్నూ బిగ్ బాస్ లో మాత్రం బాగానే వగలు పోయింది. తన డ్రెస్సింగ్ తో గ్లామర్ ఒలకపోయాడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఆమె కోసమే బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అప్పటి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు రాహుల్ తో ఈమె బిగ్ బాస్ నడిపిన ఎపిసోడ్ కూడా బాగానే హైలైట్ అయింది. ఇద్దరి మధ్యా ఏదో ఉందన్నట్లు ఇచ్చిన బిల్డప్ కూడా ప్రేక్షకులకు నచ్చింది.

నిజానికి బిగ్ బాస్ లో పెద్దగా టాస్క్ లు అంటూ ఏం చేయని పునర్నవి, ఈ రెండు కారణాలతోనే దాదాపు 8 వారాలు ఇంట్లో గడిపేసింది. బయటకొచ్చాక కూడా పునర్నవి వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బానే హల్చల్ చేసింది. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక పునర్నవి హడావిడి మాములుగా లేదు. ఇద్దరూ కలిసి పలు టివి షోలకు వెళ్లారు. ఇదంతా ఇప్పుడు ముగిసిపోయింది, ఎవరి కెరీర్స్ లో వాళ్ళు బిజీబిజీగా మారారు.

ఇప్పుడు పునర్నవి భూపాళం ఏం చేస్తోంది అంటే.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు ఈజీగా తన హాట్ ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఈమె పెట్టిన ఫొటోస్ అయితే టాకింగ్ పాయింట్ గా మారాయి. దూరంగా చూస్తే పద్దతిగా చీర కట్టుకుని ఒక ఫ్యాషన్ షర్ట్ వేసుకుని అటు ట్రెండీగా ఇటు పద్దతిగా ఉందని ఎవరైనా అనుకుంటారు. అలా అనుకునే ప్రమాదం ఉందనే పునర్నవి కూడా తన ఇంటెన్షన్ హైలైట్ అయ్యేలా దగ్గరనుండి కూడా ఒక ఫోటో పెట్టింది. అది చూస్తే కచ్చితంగా యువత మతులు పోవడం ఖాయం. పారదర్శకంగా ఉండే ఆ షర్ట్ లో తన ఇన్నర్ అందాలు హైలైట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ వగలు పోతోంది. బిగ్ బాస్ క్రేజ్ ఉన్న లోపే అవకాశాలు పట్టాలని పునర్నవి ఆలోచిస్తూ ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తోందని అనుకుంటున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

?: @docteja Saree: @ilamralabel MUA: @makeupbyradhikadave Styling: @lankasanthoshi

A post shared by Punarnavi Bhupalam? (@punarnavib) on

Credit: Instagram