తన లవర్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన పునర్నవి

punarnavi reveals about her lover death
punarnavi reveals about her lover death

ఈ ఏడాది బిగ్ బాస్ షో లో రాహుల్, పునర్నవిల బంధం స్పెషల్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. షో మొదలైన తొలి రోజుల్లో ఇద్దరూ పెద్ద పరిచయం లేదు కాబట్టి దూరంగానే ఉన్నారు కానీ ఒక్కసారి పునర్నవి, రాహుల్, వరుణ్, వితికలు ఒక గ్రూప్ గా ఏర్పడ్డాక వీరిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. పునర్నవి, రాహుల్ ను తిట్టడం, దానికి మనోడు మురిసిపోవడం, ఇద్దరూ కలిసే ఉండడం వంటివి ప్రేక్షకులకు వీరిద్దరి మధ్యా ఏదో ఉందనే ఫీలింగ్ ను కలిగించాయి. దాంతో పాటు ఎప్పటికప్పుడు హగ్ లు ఇచ్చుకోవడం, తనకోసం కాకరకాయ జ్యూస్ తాగితే పునర్నవి, రాహుల్ ను ముద్దు పెట్టుకోవడం వంటివన్నీ ప్రేక్షకులకు వీరిద్దరూ లవర్స్ అనే భావన కలిగించాయి.  అయితే షో అయిపోయి బయటకు వచ్చాక వీరిద్దరూ కూడా తమ మధ్య అలాంటిది ఏం లేదని తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అవన్నీ జస్ట్ రూమర్స్ అని కొట్టిపారేశారు. రాహుల్ అయితే తాను డేట్ కు వెళదామని పిలిచినా పునర్నవి రానందని, తన జీవితంలో వేరే వ్యక్తి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ ఒకటవుతారని ఆశించిన వారికి ఇది భంగపాటనే చెప్పాలి.

ఇటీవలే పునర్నవి, రాహుల్ కలిసి ఒక షో కు కూడా అటెండ్ అయ్యారు. అందులో పునర్నవి తన లవ్ ఎపిసోడ్ గురించి ఓపెన్ అయింది. అందరిలానే తను కూడా రిలేషన్ లో ఉన్నట్లు ఓపెన్ అయింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు లేడని, చనిపోయాడని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఆ ఘటన ఎలా జరిగిందో కూడా వివరించింది. అందరిలానే రిలేషన్ లో ఉన్న తాను ఇంకా కెరీర్ లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానని, అదే తన లవర్ కుకూడా చెప్పానని, ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన కూడా జరిగిందని పునర్నవి పేర్కొంది. అందుకే కావాలని కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి చూడాలని అనుకున్నామని చెప్పింది. ఇదే సమయంలో తాను అమెరికా వెళ్లానని, తిరిగి వచ్చేసరికి అతను చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డానని ఆమె పేర్కొంది. ఇంతకీ అతను ఎలా చనిపోయాడు అంటే ఈస్టర్ సందర్భంగా ఆ వ్యక్తి శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడట.

ఈ సంఘటన గురించి పునర్నవి బిగ్ బాస్ లో కూడా చెప్పింది. అయితే అప్పుడు తన స్నేహితుడు అని మాత్రమే చెప్పింది కానీ ఇప్పుడే ఓపెన్ అయి తన లవర్ అని రివీల్ చేసింది. కొన్ని నెలలుగా తనతో మాట్లాడలేదని, ఇప్పుడు మాట్లాడాలని ఉన్నా ఆ వ్యక్తి లేడని చెప్పి ఎమోషనల్ అయింది. ఈ షాక్ లో ఉన్న తనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందట. కొంచెం ఛేంజ్ గా ఉంటుందనిపించి షో కు వెళ్లానని పునర్నవి పేర్కొంది. ఇప్పుడు పునర్నవి సింగిల్ కాబట్టి రాహుల్ తో వ్యవహారాన్ని లవ్ దాకా తీసుకెళుతుందేమో చూడాలి.