రెచ్చిపోయిన రొమాంటిక్ జోడీ!

Puri akash lip lock goes viral
Puri akash lip lock goes viral

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో స్టైల్ మార్చాడు. త‌దుప‌రి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. తండ్రి త‌ర‌హాలోనే త‌న‌యుడు ఆకాష్ పూరి కూడా `మెహ‌బూబా`తో ఆశించిన హిట్ రాకపోవ‌డంతో త‌ను కూడా ట్రెండ్ మార్చాడు. రెగ్యుల‌ర్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా సినిమా చేస్తున్నాడు అదే `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

రెగ్యుల్ ల‌వ్‌స్టోరీస్‌కి కొంచెం భిన్నంగా పూరి స్టైల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ పేరుతో మ‌రింత రొమాంటిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 29న రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం రిలీజ్ డేట్‌తో పాటు హీరోయిన్ హీరోయిన్‌ల‌కు సంబంధించిన లుక్‌ని పూరి సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేశారు.

హాట్ హాట్‌గా వున్న ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్టిల్ చూస్తుంటే పేరుకి మించి సినిమా టూ మ‌చ్‌ రొమాంటిక్‌గా వుంటుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. బ‌స్ ఫుట్‌ బోర్డ్ నుంచి బెండ‌వుతున్న హీరోయిన్ పెదాల‌పై రొమాంటిక్‌గా పూరి ఆకాష్ కిస్ చేస్తున్నతీరు సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందో తెలియ‌జేస్తోంది. జస్ట్ ఇది షాంపిల్ మాత్ర‌మేన‌ని, సినిమాలో రొమాంటిక్ జోడీ చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌ద‌ని చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది.