ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న ఛార్మి – పూరిCharmme Kaur And Puri Jagannadh
Charmme Kaur And Puri Jagannadh

ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఛార్మి – పూరి జగన్నాధ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు . రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరోయిన్ లుగా అందమైన ముద్దుగుమ్మ లు నిధి అగర్వాల్ – నభా నటేష్ లు నటించారు . జూలై 18 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . ఇప్పటికే 65 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి .

దాంతో పూరి జగన్నాధ్ , ఛార్మి లతో పాటుగా హీరోయిన్ లు నిధి అగర్వాల్ , నభా నటేష్ లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు . అయితే ఈ వేడుకలో ఇప్పటివరకు హీరో రామ్ పాల్గొనలేదు . సినిమా విడుదలకు ముందే ఫారిన్ వెళ్ళిపోయాడు . ఇక మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానున్నాడు దాంతో ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని అంటున్నారు పూరి- ఛార్మి . గతకొంత కాలంగా సినిమాలు ప్లాప్ అవుతూ పూరి ని ఇబ్బంది పెడుతున్నాయి దాంతో ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఖుషీగా ఉన్నాడు .