విజయ్ దేవరకొండ సరసన ఆ భామ నటించనుందా ?


Vijay Deverakonda
Vijay Deverakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ దర్శకులు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది . జాన్వీ కపూర్ కు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం , ఈ విషయాన్నీ తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం విదితమే !

దాంతో జాన్వీ ని విజయ్ దేవరకొండ సరసన నటింప జేయాలని చూస్తున్నాడట పూరి . అంతేకాదు బిజినెస్ పరంగా కూడా జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . జాన్వీ ఉండటం వల్ల హిందీలో రేటు మరింతగా పలుకుతుంది ఆ కారణం వల్ల కూడా జాన్వీ పట్ల మొగ్గు చూపుతున్నాడట పూరి జగన్నాధ్ . శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అన్న విషయం తెలిసిందే . జాన్వీ కపూర్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే కేకో కేక అన్నట్లే !