ఇష్మార్ట్ శంకర్ కు సీక్వెల్ రెడీ !


Puri Jagannadh confirms Ismart shankar sequel
Puri Jagannadh confirms Ismart shankar sequel

నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుండి ఆదరణ లభిస్తుండటంతో ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా ”డబుల్ ఇస్మార్ట్ ” చిత్రం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు పూరి . అసలు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సమయంలోనే సీక్వెల్ చేస్తానని అన్నాడు , అన్నట్లుగానే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు డబుల్ ఇస్మార్ట్ అని .

అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం మాత్రం కొద్దీ రోజుల్లోనే తేలనుంది . ఇస్మార్ట్ శంకర్ అసలు ఫలితం ఏంటి ? అన్నది ఈ సోమవారంకు ఫైనల్ అవుతుంది దాంతో ఆ రేంజ్ ని బట్టి డబుల్ ఇస్మార్ట్ ని తీర్చి దిద్దే పనిలో పడనున్నాడు పూరి . చాలాకాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న పూరి కి ఇస్మార్ట్ శంకర్ ఊపిరి పీల్చుకునేలా చేసింది . ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ లు ఎవరు ? అన్నది పూరి నే డిసైడ్ చేయనున్నాడు .