పూరి ఫ‌స్ట్ ఛాయిస్ ర‌మ్య‌కృష్ణ కాదా?


పూరి ఫ‌స్ట్ ఛాయిస్ ర‌మ్య‌కృష్ణ కాదా?
పూరి ఫ‌స్ట్ ఛాయిస్ ర‌మ్య‌కృష్ణ కాదా?

టాలీవుడ్‌లో వున్న స్టైలిష్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌. తెలుగు లో ఆయ‌న తీసినంత ఫాస్ట్‌గా ఇంత వ‌ర‌కు ఎవ‌రూ సినిమాలు పూర్తి చేయ‌లేదు. వ‌ర్మ‌కు త‌గ్గ శిష్యుడిగా మేకింగ్ విష‌యంలో పేరుతెచ్చుకున్న పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌ల `ఇస్మార్ట్ శంక‌ర్‌` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `ఫైటర్‌` చిత్రాన్ని సొంత బ్యాన‌ర్ లో ప్లాన్ చేస్తున్న పూరి మ‌రో ప‌క్క త‌నయుడు ఆకాష్‌తో `రొమాంటిక్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిల్ పాదూరి ఈ చిత్రం ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. బాలీవుడ్ హాట్ మోడ‌ల్ కేతికా శ‌ర్మ క‌థానాయిక‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇటీవ‌ల గోవాలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. అయితే ఈ చిత్రంలోని కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ హాటీ మందిరా బేడీని అనుకున్నార‌ట‌. అమెతో సంప్ర‌దింపులు జ‌రిపి చివ‌రికి ఫైన‌ల్ చేసుకున్నార‌ట‌. అయితే మ‌ధ్య‌లో ఏమైందో ఏమో తెలియ‌దుకానీ మందిర ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని, ఆమె స్థానంలో ర‌మ్య‌కృష్ణ‌ని ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది.

సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని చిత్ర‌బృందం ఇటీవ‌లే రిఈజ్ చేసింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్నా ఈ సినిమా ద్వారా హీరోగా ఆకాష్‌ని నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పూరి జ‌గ‌న్నాథ్‌. మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైనా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.