పూరి జగన్నాధ్ బూతునే నమ్ముకున్నాడా ?

Puri jagannadh hopes on Nidhi agerwal and nabha natesh glam
Puri jagannadh hopes on Nidhi agerwal and nabha natesh glam

దర్శకులు పూరి జగన్నాధ్ బూతునే నమ్ముకున్నాడా ? అనిపిస్తోంది వరుసగా రిలీజ్ చేస్తున్న పోస్టర్ లు చూస్తుంటే . తాజాగా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” ఇస్మార్ట్ శంకర్ ”. రామ్ హీరో ఇక హీరోయిన్ లుగా ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు అందునా ఇద్దరు కూడా కంచు ల్లాంటి అందమైన భామలు పైగా అందాలను ఉదారంగా ఆరబోయడం అంటే మహా సరదా ఈ భామలకు .

దాంతో కొద్దిరోజులుగా నభా నటేష్ , నిధి అగర్వాల్ ల హాట్ హాట్ స్టిల్స్ వదులుతూ కుర్రాళ్ళని వేడెక్కిస్తున్నాడు , యూత్ ని టార్గెట్ చేస్తున్నాడు . ఇప్పటికే రామ్ – నభా నటేష్ ల హాట్ స్టిల్స్ రిలీజ్ చేయగా తాజాగా నిధి అగర్వాల్ – రామ్ లు వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను రిలీజ్ చేసి షాక్ ఇస్తున్నాడు . గతకొంత కాలంగా పూరి జగన్నాధ్ కు సక్సెస్ లేదు , చేస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ లు అవుతూనే ఉన్నాయి దాంతో యూత్ ని టార్గెట్ చేస్తూ ఇలా బూతు స్టిల్స్ బాగానే వదులుతున్నాడు . జూలై 18 న విడుదల కానుంది ఇస్మార్ట్ శంకర్ .