పూరి `జ‌నగ‌ణ‌మ‌న` ఎవ‌రితో?

పూరి `జ‌నగ‌ణ‌మ‌న` ఎవ‌రితో?
పూరి `జ‌నగ‌ణ‌మ‌న` ఎవ‌రితో?

ఇండ‌స్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల‌కు, స్టార్ డైరెక్ట‌ర్‌ల‌కు కార్య‌రూపం దాల్చ‌ని డ్రీమ్ ప్రాజెక్ట్ లు వున్నాయి. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ వుంది. అదే `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించాల‌ని చాలా ఏళ్లుగా పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌య‌త్నిస్తూనే వున్నారు. కానీ కార్య‌రూపం దాల్చ‌డం లేదు. తాజాగా ఈ చిత్రం మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది.

స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌థ్యంలో దేశ భ‌క్తి ప్ర‌ధానంగా ఈ మూవీ సాగ‌నుంది. ఈ చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల స్టోరీలైన్ విన్న ప‌వ‌న్ పూర్తి స్క్రిప్ట్‌తో ర‌మ్మ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో గ‌తంలో బ‌ద్రి, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు వంటి చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే.

రాజ‌కీయ నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రం కావ‌డంతో ప‌వ‌న్‌కు ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా చిత్రం అవ‌స‌ర‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే ముందు ఈ చిత్రాన్ని మ‌హేష్‌బాబుతో చేయాల‌ని పూరి ముందు ప్లాన్ చేశారు. కానీ `బిజినెస్‌మెన్‌` త‌రువాత మ‌హేష్ ఎందుకో పూరితో సినిమా చేయ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌డు ప‌వ‌న్ వ‌ద్ద‌కు చేరిన‌ట్టు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ‌