పూరిజ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ బాలీవుడ్ బాట‌ప‌డుతున్నారా?పూరిజ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ బాలీవుడ్ బాట‌ప‌డుతున్నారా?
పూరిజ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ బాలీవుడ్ బాట‌ప‌డుతున్నారా?

టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు పూరిజ‌గ‌న్నాథ్. అయితే ఒకానొక సంద‌ర్భంగాలో వ‌రుస ఫ్లాపుల్లో వున్న పూరి ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం చేసిన చిత్రం `బుడ్డా హోగా తేరా బాప్‌`. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ సినిమా త‌రువాత పూరిజ‌గ‌న్నాథ్ మ‌రో హిందీ సినిమా చేయ‌లేదు. `బిజినెస్‌మెన్‌`తో తెలుగులో మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌ప‌ట్టారు. దాంతో బాలీవుడ్‌లో మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. ఇన్నాళ్ల మ‌ళ్లీ బాలీవుడ్‌లో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా `ఫైట‌ర్‌` చిత్రాన్ని చేస్తున్న పూరిజ‌గ‌న్నాథ్ ఈ సినిమాని పూర్తి చేసి వెంట‌నే బాలీవుడ్ లో ఓ హిందీ చిత్రం చేయాల‌నే ప్లాన్‌లో వున్న‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టికే ఓ క్రేజీ హీరోకు క‌థ వినిపించార‌ని, స్టోరీ చాలా అద్భుతంగా కుదిరింద‌ని, ఈ త‌ర‌హా క‌థ పూరి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని, బాలీవుడ్ వ‌ర్గాల‌కు ఈ సినిమాతో పూరి మ‌రోసారి షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని చార్మి చెప్పిన‌ట్టు వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని పూరిజ‌గ‌న్నాథ్  వెల్ల‌డించే అవ‌కాశం వున్న‌ట్టు తెలిసింది.