ఇస్మార్ట్ శంకర్ హిట్టే కాలేదు సీక్వెల్ తీసారట !


ISmart Shankar
ISmart Shankar Poster

రామ్ హీరోగా నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18 న విడుదల కానుంది . అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు , హిట్ కాలేదు కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ తీస్తామని అంటున్నారు పూరి అండ్ కో . నాలుగేళ్లుగా పూరి జగన్నాధ్ కు హిట్ లేదు . చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ లే అవుతున్నాయి .

దాంతో ఇస్మార్ట్ శంకర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇద్దరు అందమైన భామల అందాలు , రామ్ యాక్టింగ్ వెరసి ఇస్మార్ట్ శంకర్ ని హిట్ చేస్తాయని , సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి . అయితే ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ అనే ఆలోచన లేకపోతే అంతే ! అయితే ఇస్మార్ట్ శంకర్ పరిస్థితి ఏంటి ? అన్నది ఈనెల 18 న తేలనుంది .