పూరి జ‌గ‌న్నాథ్ మామూలోడు కాదుగా!


పూరి జ‌గ‌న్నాథ్ మామూలోడు కాదుగా!
పూరి జ‌గ‌న్నాథ్ మామూలోడు కాదుగా!

ప్ర‌పంచం మొత్తం లాక్ డౌన్ కార‌ణంగా స్థంభించిపోయింది. ఎక్క‌డా ఎలాంటి కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌డం లేదు. ఎలాంటి హ‌డావిడీ లేదు. హంగామా లేదు. అంతా ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో ఎలాంటి కోలాహ‌లం వినిపించ‌డం లేదు. పిండ్రాప్ సైలెంట్‌. ఎక్క‌డ ఎలాంటి వార్త‌లు వినాల్సి వ‌స్తుందో.. ఎవ‌రి ద్వారా వైర‌ల్ వైర‌ల్ అయిపోయి అంద‌రినీ క‌మ్మేస్తుందో న‌నే భ‌యం..

క్ష‌ణం తీరిక లేకుండా కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకుని తిరిగిన జ‌నం ఇప్పుడు కాళ్లు క‌ట్టేసుకుని ఇంటిప‌ట్టునే వుంటున్నారు. ఇదిలా వుంటే లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది ఇష్ట‌మైన వంట‌లు వండేస్తూ కొత్త కొత్త రుచులు ట్రై చేస్తున్నారు. ఇంకొంత మందేమో పెయింటింగ్ వేస్తున్నారు.

అయితే పూరి మాత్రం స్క్రిప్ట్ రాస్తున్నాడ‌ట‌. అదేంటి పూరి స్క్రిప్ట్ రాయాలంటే బ్యాంకాక్ వెళ్లాలి క‌దా? అంటే అది నిన్న‌టి మాట‌. ప్ర‌స్తుతం ఎవ‌రూ ఊహించ‌ని, విన‌ని లాక్ డౌన్ కాలంలో వున్నాం కాబ‌ట్టి ఇంటికే ప‌రిమిత‌మైన పూరి ఇంట్లోనే కాల‌క్షేపం చేయ‌కుండా ప్ర‌స్తుత క్రూషియ‌ల్ పీరియ‌డ్ అనుభ‌వంతో ఓ స్క్రిప్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాడ‌ట‌. పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైరస్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా వేశారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ప‌రిస్థితులు మారితే మ‌ళ్లీ రెగగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తార‌ట‌.