టైటిల్ ప్రకటించి షాక్ ఇచ్చిన పూరి


Puri jagannadh and Ram film title officially announced
Ram Pothineni

దర్శకులు పూరి జగన్నాధ్ తన కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించి షాక్ ఇచ్చాడు . రామ్ హీరోగా పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే . రామ్పూరి జగన్నాధ్ ల సినిమా టైటిల్ ఏంటో తెలుసా …… ” ఇస్మార్ట్ శంకర్ ” . టైటిల్ ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ ని టైటిల్ లోగో ని కూడా రిలీజ్ చేసారు . టైటిల్ డిఫరెంట్ గా ఉంది అలాగే రామ్ లుక్ కూడా మరింత డిఫరెంట్ గా ఉంది .

చాలాకాలంగా రామ్ కు సరైన హిట్ లేదు , అలాగే దర్శకులు పూరి జగన్నాధ్ కు కూడా హిట్ లేదు దాంతో కసిగా ఉన్నారు ఈ ఇద్దరు . వీళ్ళకి ఛార్మి కూడా తోడయ్యింది . హీరోయిన్ గా వేషాలను పక్కన పెట్టి నిర్మాణం సైడ్ దూకింది ఛార్మి . ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ యాసలో ఉండే సినిమా అన్నట్లుగా తెలుస్తోంది . ఇక రామ్ అయితే సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు . సినిమా పోస్టర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఆసక్తి పెరిగింది ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై .

 

English Title: Puri jagannadh and Ram film title officially announced