ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ కి కాపీ నే !

Ismart shankar
Ismart shankar

ఇస్మార్ట్ శంకర్ చిత్రం హాలీవుడ్ చిత్రాన్ని చూసి రాసుకుందే కానీ కాపీ కాదు కేవలం స్ఫూర్తి మాత్రమే అని అంటున్నాడు అంటే ఫ్రీమేక్ అన్నమాట . కాకపోతే రీమేక్ అంటే వాళ్లకు డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కోవాలి ఫ్రీ మేక్ చేయాలంటే స్ఫూర్తి అంటే సరిపోద్ది అందుకే దర్శకులు పూరి జగన్నాధ్ ఇది కాపీ కాదు స్ఫూర్తి మాత్రమే ! అని అంటున్నాడు .

రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ లుగా ఇద్దరు కంచులు నటించారు . ఒకరు నిధి అగర్వాల్ కాగా మరొకరు నభా నటేష్ లు . ఈ ఇద్దరు కూడా గ్లామర్ తో చంపేస్తున్నారు . సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు విడుదల అవుతోంది . రామ్ కు అలాగే ఛార్మి కి , పూరి జగన్నాధ్ కు నిధి అగర్వాల్ , నభా నటేష్ ఇలా అందరికి సక్సెస్ కావాలి ఎందుకంటే వీళ్లంతా ప్లాప్ లను ఎదుర్కొంటున్నారు మరి .