మహేష్ బాబు పై నిందవేసిన పూరి జగన్నాద్


Puri Jagannadh sensational comments on Mahesh babu
Puri Jagannadh sensational comments on Mahesh babu

మహేష్ బాబు పై నింద వేసాడు దర్శకులు పూరి జగన్నాధ్ . నేను హిట్ కొట్టినప్పుడే మహేష్ బాబు నాకు సినిమా చేసే అవకాశం కల్పిస్తాడు లేకపోతే లేదు అని చెప్పడమే కాకుండా మహేష్ బాబు కంటే నాకు మహేష్ అభిమానులు అంటేనే ఇష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు . మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇంతకుముందు పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలు రాగా రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి .

అయితే పోకిరి చిత్రం మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది . ఇక మూడో సినిమాగా జనగణమన అనే సినిమా చేయాలనుకున్నాడు పూరి . కానీ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దాంతో మహేష్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో నేను సక్సెస్ లో ఉంటే సినిమా ఛాన్స్ ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అని వ్యాఖ్యానించడం ద్వారా మహేష్ బాబు పై పెద్ద నిందనే వేసాడు . ఈ విషయం పై మహేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .