కుక్క చనిపోవడంతో బాధపడుతున్న పూరి జగన్నాధ్


తన కుక్క చనిపోవడంతో తీవ్రంగా బాధపడుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్ . జాక్స్ అనే కుక్క అంటే పూరి జగన్నాధ్ కు చాలా చాలా ఇష్టం , అయితే పూరి ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో ఆ కుక్క ని పోషించలేక దాన్ని స్నేహితుడ్ని పెంచుకోమని ఇచ్చాడట ! ఇక అప్పటి నుండి జాక్స్ అనే కుక్క పూరి జగన్నాధ్ అంటే విపరీతమైన కోపమట !

అందుకే అప్పటి నుండి జాక్స్ అనే కుక్క పూరి జగన్నాధ్ ని చూడటం లేదట ! తోక కూడా ఊపలేదట పూరి ని చూసి అంతేనా ఎప్పుడు కూడా పూరి జగన్నాధ్ దగ్గరకు వెళ్లలేదట ! ఎందుకంటే నేనంటే జాక్స్ కు కోపం …… నేను దాన్ని బాగా బాధపెట్టాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు పూరి . ఈరోజు జాక్స్ అనే కుక్క చనిపోయింది దాంతో బాధపడుతూ ఈ పోస్ట్ పెట్టాడు పాపం .