తెరమరుగైన దర్శకులకు పూరి సాయం


Puri Jagannadh
Puri Jagannadh

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కష్టం నుండి పైకొచ్చిన వ్యక్తి. కష్టపడి పైకొచ్చినా నమ్మిన వాళ్ళు మోసం చేయడంతో సర్వం కోల్పోయాడు. మళ్ళీ జీరో నుండి కెరీర్ మొదలుపెట్టి ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ మధ్య వరస ప్లాపులతో సతమతమైన పూరి ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ కొట్టాడు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఈ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఒకటి లేదా రెండు సినిమాలు తీసి వివిధ కారణాల వల్ల రిటైర్మెంట్ ప్రకటించుకున్న 20 మంది దర్శకులకు సినిమా తీయడానికి ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా దర్శకులు కావాలని కలలు కని అవ్వలేకపోయిన కో డైరెక్టర్లకు కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

రేపు ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగే ఫంక్షన్ పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఎంపిక చేసిన కొంతమందికి ఆర్ధిక సహాయం చేయనున్నారు.