గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్


గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్
గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్, మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్సిందే. ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఢిల్లీ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఈ ఇటీవలే ప్రకటించారు. ఆమె కూడా గోవా షెడ్యూల్ లో పాల్గొన్నారు. కొన్ని రోజుల విరామం తర్వాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను వచ్చే ఏడాది మార్చ్ కల్లా పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అనిల్ పాడూరి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నా పూరి జగన్నాథ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.