విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇస్తాడా ?


Puri Jagannadh And Vijay Devarakonda
Puri Jagannadh And Vijay Devarakonda

విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ పూరి జగన్నాధ్ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు , అసలు ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తోనే చేయాలనీ అనుకున్నాడట ! కానీ కుదరలేదు . ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు కాబట్టి మహేష్ బాబు తో చేయాలనుకున్న జనగణమన అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయాలనే ఆలోచన చేస్తున్నాడట పూరి .

అయితే విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? చూడాలి . టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు . దాంతో పలువురు దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనే ఆలోచనతో వెంటపడుతున్నారు . ఈ లిస్ట్ నిజంగానే చాలా పెద్దగా ఉంది . అయితే వాళ్ళందరిని కాదని విజయ్ దేవరకొండ పూరి కి ఛాన్స్ ఇస్తాడా ? అన్నదే ప్రశ్న !