పూరి టంగ్ థియేరీ:  తాగితే నోరు అదుపులో వుండాల్సిందే!

పూరి టంగ్ థియేరీ:  తాగితే నోరు అదుపులో వుండాల్సిందే!
పూరి టంగ్ థియేరీ:  తాగితే నోరు అదుపులో వుండాల్సిందే!

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ప్ర‌స్తుతం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో పాన్‌ ఇండియా స్థాయి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో పూరి కొత్త‌గా `పూరి మ్యూజింగ్స్‌` పేరుతో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌పై ఆడియోల‌ని వ‌దులుతున్నారు.

తాజాగా టంగ్ థియేరీకి సంబంధించిన ఆడియోని బ‌య‌టికి వ‌దిలారు. ఇటీవ‌ల ఫ్లాప్ సినిమాపై త‌న‌దైన థియేరీని వెల్ల‌డించి రివ్యూవ‌ర్స్‌ని విమ‌ర్శించిన పూరి తాజాగా ఒక్క‌సారి టంగ్ స్లిప్ అయితే వారి ప‌రిస్థితి.. కెరీర్ ఎలా వుంటాయో చెప్పుకొచ్చారు. మ‌నం బాగా క‌ష్ట‌ప‌డుతుంటాం. మ‌న‌కు బెస్ట్ స‌ర్కిల్ కూడా వుంటుంది. అయిన‌ప్పటికి ఎక్క‌డో మ‌న కెరీర్ ఎఫెక్ట్ అవుతూ వుంటుంది. నిజంగానే ఒకే ఒక కంప్లైంట్ రోజూ వాగే నాలుక మ‌న కెరీర్‌ని నాశ‌నం చేస్తుంది.

అది మ‌నం తెలుసుకునే లోపే మ‌న‌ల్ని పోస్ట్‌మార్ట‌మ్ చేసేస్తారు. అందుకే మ‌నం ఏం మాట్లాడుతున్నామో శ్ర‌ద్ధ పెట్ఠాలి. అవ‌త‌లివాడ్ని హ‌ర్ట్ చేసే విష‌యాన్ని మాట్లాడొద్దు. మ‌నం మాట్లాడేది పాజిటివ్ కాన‌ప్పుడు నోరు విప్పొద్దు. రెండు పెగ్‌లేసి త‌రువాత మ‌నం ఒక‌టి మాట్లాడితే మ‌న‌లోకి వెళ్లిన మందు మ‌రోటి మాట్లాడుతుంది. దాంతో వున్న బంధాలు దెబ్బ‌తింటాయి` అన్నారు పూరి.