యష్ పూరితో సినిమా చేస్తాడా?


Puri-Jaganndh-And-Yash
Puri-Jaganndh-And-Yash

గత కొన్నాళ్లుగా ప్లాపులతో సతమతమవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ రీసెంట్ గా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో పూరికి కొత్త ఎనర్జీ వచ్చినట్లయింది. ఇక పెద్ద హీరోలు సైతం పూరితో సినిమాలు చేయడానికి రెడీగా వున్నారు.

ఒకప్పుడు కథలు వినటానికి కూడా టైం ఇవ్వని వారు ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సాధిస్తోన్న కలెక్షన్స్ చూసి పూరితో సినిమాకి సై అంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇకపోతే పూరి మాత్రం ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్లో బిజీగా వున్నారు. ఇక పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా? అనే అనుమానం అందరిలో వుంది. కెజిఫ్ తో సేన్సషన్ సృష్టించిన యష్ తో పూరి సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే పూరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా చేస్తానని ఎనౌన్స్ చేసారు. ఈ రెండింటిలో ఏ ప్రాజెక్ట్ చేస్తారో ఆయనే డిసైడ్ చెయ్యాలి..