నెమ్మదిగా R.G.V లా మారుతున్న పూరీ


నెమ్మదిగా R.G.V లా మారుతున్న పూరీ
నెమ్మదిగా R.G.V లా మారుతున్న పూరీ

రామ్ గోపాల్ వర్మ… ఆ మనిషిలో ఎంత సబ్జెక్టు ఉందో.? అంతకు మించిన వెటకారం కూడా ఉంది. వర్తమాన సామాజిక వ్యవహారాల పైన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ఎదుట ఎవ్వరు కూర్చుని ఉన్నా.. ఏ అంశం మీద మాట్లాడినా.. ఎలాంటి ప్రశ్నలు అడిగినా; ఏమాత్రం తడబడకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా ఒకరికి నచ్చినా నచ్చకపోయినా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు ఆర్.జీ.వి. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా సోషల్ మీడియాలో చేసే ట్వీట్ల విషయంలో తన గురువు రాంగోపాల్ వర్మ ని ఫాలో అవుతున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ప్రపంచంలో విభిన్నజాతులకు చెందిన ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో.. నిజాలు చెప్పి ప్రజలకు స్పూర్తి కలిగించాలని ప్రయత్నం చేసిన పూరి.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ప్రజలు మళ్లీ మామూలు స్థితికి రావడానికి టైం పడుతుంది అనీ, జనాలకు పని విషయంలో స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుందని; వ్యంగ్యంగా చెప్పకనే చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఇక ఇది చూసిన వారంతా చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ను కొంచెం మార్చిగుర్తు చేసుకుంటున్నారు. “ఇప్పుడు చూడండి నెమ్మదిగా రామ్ గోపాల్ వర్మ గా మారుతున్న పూరిజగన్నాథ్..” అంటూ సరదా కామెంట్లు కూడా పెడుతున్నారు.