బాలయ్యతో మరో మాస్ సినిమా ప్లాన్ చేస్తున్న డాషింగ్ డైరెక్టర్


Puri to join hands with Balayya again
Balakrishna

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో రీసౌండింగ్ హిట్ కొట్టాడు. తన పనైపోయిందన్న వాళ్ళకి అదిరిపోయే సమాధానం చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో వరసగా సినిమాలను సెట్ చేస్తున్నాడు పూరి. ప్లాపుల్లో ఉన్నప్పుడే పూరి స్పీడ్ తగ్గలేదు, ఇక హిట్ వచ్చాక ఆగుతాడా, అందుకే ఒకవైపు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఫైటర్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. దీని తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు పూరి. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇద్దరూ 2017లో పైసా వసూల్ కోసం చేతులు కలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు వెళ్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత బోయపాటి చిత్రం కూడా ఉంది. మరి పూరి – బాలయ్య ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.