మహేష్ వద్దనుకున్న కథ ప్రభాస్ వద్దకు


Mahesh Babu And Prabhas
మహేష్ వద్దనుకున్న కథ ప్రభాస్ వద్దకు

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కాల్సిన జనగణమన కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పూరి మహేష్ పై కొన్ని విమర్శలు కూడా చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును ప్రభాస్ తో సెట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు పూరి. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకొచ్చిన పూరి తన పని ఇంకా అయిపోలేదని నిరూపించాడు.

జనగణమన చిత్రాన్ని యష్ తో కానీ, విజయ్ దేవరకొండతో కానీ తీయాలని అనుకున్నాడు పూరి. అయితే అది జరగలేదు కానీ విజయ్ దేవరకొండతో కొత్త కథను తీస్తున్నాడు. దీంతో జనగణమన ప్రాజెక్ట్ అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ను కలిసి జనగణమన చేయాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్యనే పూరి, ప్రభాస్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఈ లైన్ వినిపించినట్లు, దానికి ప్రభాస్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో తీయగలిగే సబ్జెక్ట్ కాబట్టి ప్రభాస్ కుదిరితే చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.