పూరి రచ్చ మొదలయ్యేది అప్పుడే

Puri-Jagannadh
Puri-Jagannadh

దర్శకుడిగా పూరి జగన్నాథ్ శైలి మిగతా వారికి పూర్తిగా భిన్నం. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి ఎప్పటికీ ఒక రేంజ్. అందుకే ప్రతీ స్టార్ హీరో అభిమాని, తమ హీరో పూరితో సినిమా చేయాలని కోరుకుంటాడు. పూరి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ హీరోకి కంప్లీట్ మేకోవర్ ఇవ్వడంలో పూరి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

రీసెంట్ గా వరస ప్లాపులతో ఫుల్ డౌన్ లో ఉన్న పూరి, ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంపై ఉన్న అనుమానాలన్నీ ఈ సినిమాతో పటాపంచలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుంది పూరి ఇప్పటికే ప్రకటించేశాడు.

విజయ్ ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. పూరి.. స్క్రిప్ట్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఇద్దరూ కూడా డిసెంబర్ కి ఫ్రీ అవుతారని తెలుస్తోంది. అందుకే డిసెంబర్ రెండో వారంలో వీరిద్దరూ కలిసి చేయాల్సిన సినిమా షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందట. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.