గోవాలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న పుష్ప

గోవాలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న పుష్ప
గోవాలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ పుష్పపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేద్దామని పుష్ప మేకర్స్ నిర్ణయించారు. మొదటి పార్ట్ ఈ ఏడాది విడుదలవుతుంది. సెకండ్ పార్ట్ ను 2023లో విడుదల చేస్తారు.

ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను జులై 5 నుండి తిరిగి ప్రారంభించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేసారు. దాదాపు నెల రోజులు షెడ్యూల్ కోసం గోవాలోని అన్ సీన్ లొకేషన్స్ ను ఫైనలైజ్ చేశారట. ఈ భారీ షెడ్యూల్ లో ఒక పాటను కూడా పిక్చరైజ్ చేస్తారని వినికిడి.

పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పుష్ప చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేస్తున్నారు.