పుష్ప‌రాజ్ మాసీవ్ అప్‌డేట్‌కి టైమ్ ఫిక్స్‌!

పుష్ప‌రాజ్ మాసీవ్ అప్‌డేట్‌కి టైమ్ ఫిక్స్‌!
పుష్ప‌రాజ్ మాసీవ్ అప్‌డేట్‌కి టైమ్ ఫిక్స్‌!

అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం “పుష్ప‌`. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ‌న్నీ త‌న పంథాకు పూర్తి భిన్నంగా ఊర‌మాస్ పాత్ర‌లో మాస్ లుక్‌తో న‌టిస్తున్న చిత్ర‌మిది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీ‌రోయిన్‌.

ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా బ‌న్నీ న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, రిలీజ్ డేట‌ట్ పోస్ట‌ర్ మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇదిలా వుంటే బ‌న్నీ పుట్టిన రోజు ఈ నెల 8న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి మాసీవ్ అప్‌డేట్‌ని అందిస్తున్న‌ట్టు చిత్ర బృందం శ‌నివారం ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా పుష్ప‌రాజ్ ప్రీలుడ్ పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేసింది.

బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ నెల 7న అంటే బ‌న్నీ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు ఏప్రిల్ 7 సాయంత్రం 6:12 నిమిషాల‌కు మాసీవ్ అప్‌డేట్‌ని రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. పుష్ప‌రాజ్ విజువ‌ల్‌ని ప్ర‌త్యేకంగా ఈ రోజు ప్ర‌జెంట్ చేయ‌బోతున్నారు. ప్రీ లుడ్‌లో ఆర్ ఆర్‌.. విజువ‌ల్స్ చూస్తుంటే సినిమా మొత్తం ఓ విజువ‌ల్ ట్రీట్‌లా వుండేలా క‌నిపిస్తోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా మ‌ల‌యాళ న‌టుడు ఫహ‌ద్ పాజిల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూఊపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.