అప్పుడే పుష్ప‌రాజ్ రికార్డుల మోత‌!

 

Pushpa teaser breaks baahubali, radheshyam records
Pushpa teaser breaks baahubali, radheshyam records

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ముత్యంశెట్టి మీడియాతో క‌లిసి మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ టీజ‌ర్‌ని ఇటీవ‌ల బ‌న్నీ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు అంటే ఈ నెల 7న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. విడుద‌లైన 24 గంట‌ల్లోనే 25 మిలియ‌న్‌ల వ్యూస్‌ని క్రాస్ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్‌లో 30 మిలియ‌న్‌ల వ్యూస్‌ని దాటేసింది. అంతే కాదు మిలియ‌న్ లైక్స్‌కు చేరువ కాబోతూ స‌రికొత్త రికార్డుని న‌మోదు చేయ‌బోతోంది. ఇదిలా వుంటే లైక్స్ విష‌యంలో `బాహుబ‌లి`, రాధేశ్యామ్‌` చిత్రాల రికార్డుని `పుష్ప‌` ఇప్ప‌టికే అధిగ‌మించేసింది. టీజ‌ర్‌లో ఊర‌మాస్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో హైవోల్టేజ్ యాక్ష‌న్ సీన్‌ల‌తో `త‌గ్గేదేలే..` అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగ్ అభిమానుల‌కు ఆక‌ట్టుకుంటోంది.

యాదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా బ‌న్నీ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా మాస్ లారీడ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ పాజిల్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సునీల్ క‌నిపించ‌బోతున్నారు. జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ క‌న్న‌డ న‌టుడు ధ‌నంజ‌య‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఆగ‌స్టు 13న ఐదు భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.