ర‌ష్మిక పుట్టు చికెన్ రుచి చూశారా?ర‌ష్మిక పుట్టు చికెన్ రుచి చూశారా?
ర‌ష్మిక పుట్టు చికెన్ రుచి చూశారా?

మెగాస్టార్ ముద్దుల కోడ‌లు కొణిదెల ఉపాస‌న `యువ‌ర్ లైఫ్‌` పేరుతో కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో హెల్దీఫుల్ ఫుడ్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచేందుకు త‌న వంతు బాధ్య‌తగా సెల‌బ్రిటీల‌తో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ముందు స‌మంత‌ని గెస్ట్ ఎడిట‌ర్‌గా నామినేట్ చేసిన ఉపాస‌న కొణిదెల తాజాగా క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌ని నియ‌మించారు.

ప‌లు వ‌ర్క‌వుట్‌ల‌తో ఆక‌ట్టుకున్న ర‌ష్మిక తాజాగా వంట‌ల‌తోనూ ఆరోగ్య చిట్కాలు చెబుతోంది.  హెల్త్ గురించి త‌ను ఏం ఫాలో అవుతుందో ఆడియ‌న్స్‌కు వివ‌రిస్తూ రుచిక‌ర‌మైన‌, అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌ల‌ని ప‌రిచ‌యం చేస్తోంది. తాజాగా చికెన్ తో `కోలీపుట్టు` కూర రెసిపీ చేసిన ర‌ష్మిక అద‌ర‌గొట్టింది. త‌ను చేసిన రెసిపీని ఉపాస‌న‌కు రుచి చూపించింది. ర‌ష్మిక వంట‌కు ఉపాస‌న వంద మార్కులు వేసి న‌టిగానే కాకుండా చెఫ్‌గా కూడా ర‌ష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చింది.

ర‌ష్మిక‌కు ఇంకా పెళ్లి కాలేద‌నీ, మంచి వంట చేసే భార్య కోసం ఎవ‌రైనా ఎదురుచూస్తుంటే అందుకు ర‌ష్మిక మంచి ఆప్ష‌న్ అని ఫ‌న్నీ కామెంట్ చేసింది ఉపాస‌న‌. ఇలా ర‌ష్మిక‌, ఉపాస‌న‌ల స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో తాజా వీడియో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో బ‌న్నీ – సుకుమార్‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`తో పాటు కార్తి న‌టిస్తున్న `సుల్తాన్‌`లో న‌టిస్తోంది.