మహేష్ బాబు పై ఆగ్రహంగా ఉన్న పివిపి


pvp angry on mahesh babu and dil raju మహేష్ బాబు పై ఆగ్రహంగా ఉన్నాడు నిర్మాత పివిపి . ఈ పివిపి ఎవరో తెలుసా …….. మహేష్ పై ఆగ్రహం ఎందుకో తెలుసా …….. బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ సినిమాని మహేష్ బాబు తో నిర్మించిన నిర్మాత ఈ పివిపి నే ! అలాగే మహేష్ బాబు తన కు డేట్స్ మళ్ళీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వేరేవాళ్లకు సినిమా చేస్తున్నాడని మహేష్ పై కోపంగా ఉన్నాడు పివిపి . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి నిర్మించిన బ్రహ్మోత్సవం 2016 లో విడుదలై అత్యంత చెత్త చిత్రంగా రికార్డులను సృష్టించింది .

దాంతో షాక్ తిన్న మహేష్ బయ్యర్ల ని ఆదుకోవడానికి పివిపి కి మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు . పివిపి కూడా మహేష్ నాకు సినిమా చేస్తాడు కదా అని వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పెట్టుకున్నారు . కథ రెడీ అయ్యింది ఇక షూటింగ్ కి వెళ్ళడమే తరువాయి అనుకుంటున్న సమయంలో పివిపి స్థానంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు వచ్చి చేరారు . దాంతో పివిపి కి కాకుండా వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అయ్యింది అందుకే పివిపి కోర్టు కెక్కాడు . అయితే మద్యలో రాజీ అనుకున్నారు కానీ ఎక్కడో తేడా కొట్టింది . వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈరోజు మహేష్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది . అంతే పివిపి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు మహేష్ అండ్ కో మీద .