హైద‌రాబాద్ ఇండిపెండెంట్ రిప్ర‌జెంటివ్ ల‌పై వైఖ‌రి: `క‌్యూనెట్`

Qnet press note`ఈ` కామ‌ర్స్ డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో అగ్ర‌స్థానంలో ఉన్న  బ‌హుళ జాతి సంస్థ `క్యూనెట్`. భార‌త‌దేశంతో పాటు, 100కి పైగా దేశాల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోన్న ఈ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం హాంకాంగ్ లో ఉంది. విస్తృత శ్రేణి ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్న క్యూనెట్ 20 సంవ‌త్స‌రాల‌కు పైగా స్వ‌తంత్ర ప్ర‌తినిధుల‌(ఐఆర్) నెట్ వ‌ర్క్ ను క‌ల్గి ఉంది. భార‌త‌దేశంలో క్యూనెట్ స‌బ్ ప్రాంశ్చైజీ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (భార‌త్) ప్రైవెట్ లిమిటెడ్  సాయంతో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. భార‌త‌దేశంలో క్యూనెట్ సంస్థ‌కు సుమారు ఐదు ల‌క్ష‌ల మంది స్వ‌తంత్ర ప్ర‌తినిధుల నెట్ వ‌ర్క్ ఉంది. వ్యాపారం రంగంలో విజ‌యం సాధించాల‌ని ఆకాక్షించే వారంద‌రికీ క్యూనెట్ అవ‌కాశాలు కల్పిస్తోంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌నిచేస్తోన్న స్వ‌తంత్ర ప్ర‌తినిధులు (ఐఆర్) ల అరెస్ట్  త‌మ‌ను పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. 2016 సెప్టెంబ‌ర్ నెల‌లో వినియోగ‌దారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా2017 మార్చిలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ‌కు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల‌కు భిన్నంగా అరెస్టులున్నాయి. క్యూనెట్ బిజినెస్ పోంజీ స్కీమ్ కానేకాదు హైద‌రాబాద్ న‌గ‌రంలో అధికారుల త‌నిఖీలు నిర్వ‌హించ‌డం మాకు ఆశ్చ‌ర్యం క‌ల్గించింది. అక్టోబ‌ర్ నెల‌లో ఒక వినియోగ‌దారుడు చేసిన ఫిర్యాదుపై మేం స్పందించ‌డానికి 30 రోజులు గ‌డువు ఉంటుంది. దీనిపై మేం అంత‌ర్గ‌త ద‌ర్యాప్తున‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాం. ఏ ఉత్ప‌త్తి అయినా ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు మా సంస్థ సిద్దంగా ఉన్న‌ది.

నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా 30 రోజుల గ‌డువులోగా ఫిర్యాదుల‌పై స్పందిస్తూ ఆయా ఉత్ప‌త్తుల విలువ రిఫండ్ కు చ‌ర్య‌లు తీసుకుంటాం.  దీనిపై విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ వివిధ రాష్ర్టాల్లో తాను అనుస‌రించనున్న మార్గ‌ద‌ర్శ‌కాలను నివేదిక స‌మ‌ర్పించింద‌ని క్యూనెట్ తెలిపింది.  వినియోగాధారుల పిర్యాదు ఆధారంగా క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తద్వారా ఆరెస్ట్  వ‌ర‌కూ వెళ్ల‌డం స‌రికాద‌ని క్యూనెట్  భావిస్తోంది. అయితే భార‌త క్యూనెట్ ఫరిదిలో ప‌నిచేస్తోన్న స్వ‌తంత్ర ప్ర‌తినిధులు మా అధికారులు ఉద్యోగులు కాదు. వారు మా విధాన‌లు, కోడ్ పాటించాల్సిన ప‌నిలేదు. వినియోగ‌దారులు  పూర్తి వివ‌రాల కోసం మా క‌మ్యునికేష‌న్ విభాగం నుంచి వివ‌ర‌ణ‌లు తీసుకొవ‌చ్చ‌ని తెలిపారు.

 

English Title: Qnet press note