`ప‌వ‌ర్‌స్టార్` ట్రైల‌ర్ లీక్ అయ్యిందా.. లీక్ చేశారా?`ప‌వ‌ర్‌స్టార్` ట్రైల‌ర్ లీక్ అయ్యిందా.. లీక్ చేశారా?
`ప‌వ‌ర్‌స్టార్` ట్రైల‌ర్ లీక్ అయ్యిందా.. లీక్ చేశారా?

సెల‌బ్రిటీల‌ని బ్లాక్ మెయిల్ చేస్తూ సినిమాలు తీయ‌డం ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువైపోయింది. వీక్ పాయింట్‌ల‌ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తూ సంచ‌ల‌నం సృష్టించాల‌ని కొంత మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ కొంత మందిలో రామ్ గోపాల్ వ‌ర్మ ముందుంటున్నారు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` పేరుతో ఏపీ ఎన్నిక‌ల వేళ ఓ సినిమాని రూపొందించి ర‌చ్చ చేసిన వ‌ర్మ తాజాగా అదే పంథాలో స్టార్ హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

అచ్చం ప‌వ‌న్‌ని పోలిన ఓ వ్య‌క్తిని ఎంచుకుని అవే మేన‌రిజ‌మ్స్‌తో క్యారెక్ట‌ర్‌ని మ‌లిచి కొత్త ర‌చ్చ‌కు తెర‌లేపారు వ‌ర్మ‌. ఈ చిత్రం ప‌వ‌న్‌కు సంబంధించింది కాదు అంటూనే ప‌వ‌న్‌ని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ని ఈ 22న ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తాన‌ని, చూడాల‌నుకున్న వాళ్లు లాగిన్ అయి 25 చెల్లించి ట్రైల‌ర్‌ని చూడొచ్చ‌ని రేట్ ఫిక్స్ చేశాడు వ‌ర్మ‌. అయితే ఉద‌యం 11 గంట‌ల‌కు ముందే ఈ చిత్ర ట్రైల‌ర్ యూట్యూబ్‌లో లీకైంది అంటూ వ‌ర్మ‌నే హింట్ ఇచ్చాడు.

అంటే లీక్ అయ్యిందా.. కావాల‌నే లీక్ చేశారా అన్న‌ది తెలుసుకోలేనంతగా జ‌నం లేరు. కావాల‌నే లీక్ చేయించిన వ‌ర్మ లీక్ అయిపోయిందంటూ ప్ర‌క‌టించ‌డం విడ్డూర‌మే. ప‌బ్లిసిటీలో ఓ భాగ‌మే. ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూసిన ప‌వ‌న్ ఉద్వేగానికి గుర‌వుతున్న‌ట్టు ఆ చిరాకులో ఓ స్టార్‌ డైరెక్ట‌ర్ ని చెడా మ‌డా కొట్టిన‌ట్టు.. ఆ త‌రువాత త‌న‌ని ప‌ర‌మ‌ర్శించ‌డానికి వ‌చ్చిన ఏపీ ప్ర‌తి ప‌క్ష నేత‌ని కూడా చెడా మ‌డా క‌డిగేసిన‌ట్టుగా ట్రైల‌ర్‌లో క‌నిపిస్తోంది. కేవ‌లం అర‌గంట నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్‌లో చాలా వ‌ర‌కు ప‌వ‌న్‌, త్రి‌విక్ర‌మ్‌, చంద్ర‌బాబు నాయుడుల‌పైనే వ‌ర్మ‌ దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.