ఫ్యాన్స్ తిడ‌తారంటున్న రేణు దేశాయ్‌!

 

R‌enudesai about fans comments
R‌enudesai about fans comments

రేణు దేశాయ్ గ‌త కొంత కాలంగా ప‌వన్ ‌క‌ల్యాణ్‌తో విడిపోయి దూరంగా వుంటున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌కు సంబంధించి చాలా సంద‌ర్భాల్లో త‌ను మాట్లాడిన ప్ర‌తి సారి త‌న‌పై కొంత మంది విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేణు దేశాయ్ తాజాగా మ‌రోసారి స్పందించింది. ఒక వేళ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై తాను ఏదైనా మాట్లాడితే కొంత మంది త‌న‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నార‌ని వాపోయింది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రేణు దేశాయ్ ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా కొంత మంది నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న వేళ అంతా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని రేణు దేశాయ్ సూచించారు.

అత్యవసరమైతేనే జన సమూహాల్లోకి వెళ్లాలని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి ఏమైనా మాట్లాడ‌తారా? అని అడిగితే … ఆయ‌న గురించి ఏం మాట్లాడ‌మంటారు? ఒక వేళ ఆయ‌న గురించి మాట్లాడితే `రేణుకి ఏం ప‌నిలేదు. ఎప్పుడూ ఆయ‌న గురించే మాట్లాడుతుంది` అని మ‌ళ్లీ న‌న్నే తిడ‌తారు పెడ‌తారు. య‌మీరు అడిగార‌ని మాట్లాడితే ఆ త‌రువాత నాపై కామెంట్లు చేస్తారు. అలాంట‌ప్పుడు నేనేం చేయాలి. అందువ‌ల్లే లైవ్‌కి రావ‌డం క‌ష్టంగా వుంటుంది` అని తెలిపింది.