అన్నీ ఓపెన్ గా చెప్పేసిన ఆర్.జి.వి


 

R.G.V’s Shocking behavior with naina ganguly
R.G.V’s Shocking behavior with naina ganguly

రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా ఎంత సేన్సేషనో.. బాలీవుడ్ లో ఆయన తీసిన రంగీలా సినిమా అంత సెన్సేషన్. ఎందుకంటే, ఇక్కడ సౌత్ లో హీరోలు, వాళ్ళ బాబులు, డామినేషన్ చూసిన రామ్ గోపాల్ వర్మ ముంబై కి వెళ్లి కంపెనీ పెట్టిన కొత్తల్లో ఆయనకు క్రియేటివిటీ పరంగా ఇంకా చెప్పుకోలేని అవరోధాలు ఎదురయ్యాయి. అప్పుడు బాలీవుడ్ ని శాసిస్తున్న, ఖాన్, కపూర్, కన్నా, బ్యాచ్ ని సవాల్ చేసేలా ఊర్మిళ అనే ఒక కొత్త అమ్మాయి తో రామ్ గోపాల్ వర్మ తీసిన ఎమోషనల్ లవ్ స్టోరీ “రంగీలా.” ఆ తర్వాత బాలీవుడ్ లో వచ్చిన ఎన్నో ఇండిపెండెంట్ హీరోయిన్ క్యారెక్టర్ లకు స్ఫూర్తి రంగీలా. అప్పట్లో ఆ సినిమా రూ.133 కోట్ల బిజినెస్ చేసింది. రామ్ గోపాల్ వర్మ ముంబైకి బాద్షాగా మారాడు.

ఊర్మిళ లాంటి అమ్మాయి కలవకపోతే, అల్లాంటి సబ్జెక్ట్ చేసేవాడిని కాదని, రీసెంట్ గా జరిగిన బ్యూటిఫుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు ఆర్.జి.వి. ఇక ఆ తర్వాత నైనా గంగూలీ దొరకబట్టే మళ్ళీ బ్యూటిఫుల్ లాంటి సబ్జెక్ట్ చేసానని క్లియర్ చేసాడు. ఇక నిన్న జరిగిన ప్రీ న్యూ ఇయర్ పార్టీలో ఎమోషన్ కు గురై నైనా గంగూలీ కాళ్ళు పట్టుకున్నాడు, ఆర్.జి.వి.

అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక భావోద్వేగానికి లోనైన నైనా గంగూలీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కరెక్టుగా ఒక క్రియేటర్ కి కావాల్సిన మనిషి దొరికితే తీసే, సినిమాలు ఎన్నేళ్ళయినా అలా హిస్టరీలో మిగిలిపోతాయి. అందులో ఊర్మిళ – ఆమీర్ ఖాన్ – జాకీ ష్రాఫ్ లతో వర్మ చేసిన రంగీలా కూడా ఒకటి.