పెళ్లి చేసుకోనందుకు బాధపడుతున్న కామ్రేడ్


ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి లేదంటే జీవితాంతం బాధపడాల్సిందే అంటూ తన బాధని వ్యక్తం చేస్తున్నాడు విప్లవ చిత్రాల కథానాయకుడు , దర్శకుడు , నిర్మాత ఆర్ . నారాయణమూర్తి . విప్లవాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న నటుడు ఈ ఆర్ నారాయణమూర్తి . అయితే సినిమాలు మోజులో పడిన ఈ నటుడు పెళ్లి చేసుకునే ఏజ్ లో పెళ్లి ని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు .

 

కట్ చేస్తే ఒంటి మీదకు 64 ఏళ్ళు వచ్చాయి దాంతో ఇప్పుడు పెళ్లి మీద గాలి మళ్లినట్లుంది . పెళ్లి చేసుకోకుండా పెద్ద తప్పు చేశాను అంటూ కుమిలిపోతున్నాడు . అందుకే ఇప్పటి వాళ్లకు ఉచిత సలహా ఇస్తున్నాడు . కెరీర్ , లైఫ్ లో సెటిల్ అవ్వాలని పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేసేవాళ్ళు ఈరోజుల్లో ఎక్కువ మంది ఉన్నారని అటువంటి వాళ్ళు పెళ్లీడులోనే పెళ్లి చేసుకుంటే మంచిదని , ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదని అందుకు నా జీవితమే ఉదాహరణ అని అంటున్నాడు . నిజమే ఆర్ . నారాయణ మూర్తి కామ్రేడ్ అయినప్పటికీ పెళ్లి గురించి మాత్రం చక్కగా చెప్పాడు .