ఈ ట్రెండ్ 12 ఏళ్ళ క్రితమే సెట్ చేసిన త్రివిక్రమ్


ఈ ట్రెండ్ 12 ఏళ్ళ క్రితమే సెట్ చేసిన త్రివిక్రమ్
ఈ ట్రెండ్ 12 ఏళ్ళ క్రితమే సెట్ చేసిన త్రివిక్రమ్

ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా “R.R.R”. ఈ సినిమాకు  సంబంధించి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు “కొమరం భీమ్” పాత్ర చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్… ఇటీవల అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న తన సహ నటుడు రామ్ చరణ్ తేజ్ గురించి వివరిస్తూ చేసిన ఆ వీడియో చూసి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

“వాడు కనబడితే నిప్పు కణం నిలవడినట్లుఉంటది.”

“పరిగెడితే వేగుచుక్క ఎగబడినట్టుఉంటది”

“చావు కైనా వాణ్ణి చూస్తే చెమట ధార కడతది.” ఇలా తెలుగు,తమిళం,కన్నడ మూడు భాషలలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా తన గాత్రాన్ని అందించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహాన్ని అభినందిస్తున్న సినిమా అభిమానులు ఈ సందర్భంగా మరొక సంఘటన కూడా హైలైట్ చేస్తున్నారు.

సరిగ్గా 12 సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “జల్సా” అనే సినిమా వచ్చింది. సినిమాలో హీరో పాత్ర అయిన సంజయ్ సాహు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కు మరొక సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా గాత్రం అందించారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఇది ఒక సంచలనం. ఇక సినిమా అభిమానులు అందరూ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఎంతైనా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ నిజమే..! “మా అన్న ట్రెండ్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు. ఇప్పుడు ఒక హీరోకి మరొక హీరో ఇంట్రడక్షన్ చెప్పే ఈ ట్రెండ్ ని మా అన్న 12 ఏళ్ల క్రితమే సెట్ చేశాడు..!” అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.