ఇద్దరు “సూపర్ స్టార్స్” సినిమాల కోసం మధ్యలో నలుగుతున్న రత్నం


rathnavelu
rathnavelu

కొన్ని సినిమాలు పూజ మంచిగా జరుపుకోవటం, తొందరగా షూటింగ్ జరుపుకోవటం చూసాం, దానికి కారణం అంటే ముందుగా కెమరామెన్ అని చెప్పాలి, ఎందుకంటే ఎంత మంచిగా తీస్తే, అంత మంచిగా వస్తుంది కాబట్టి, తొందరగా అయిపోతుంది కాబట్టి.

ఒకవేళ సినిమా లేట్ అయితే ! అదే మనం ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం. ఎందుకంటే కెమెరామెన్ ఒక సినిమా చేస్తూ, ఇంకొక సినిమా చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వస్తే సన్నివేశం ఎలా ఉంటుందో “ఆర్. రత్నవేలు” ని చూస్తే తెలుస్తుంది.

నిజానికి రత్నవేలు గారు ఒక సినిమా మీద మాత్రమే గురి పెడతారు, అది రిలీజ్ అయ్యాక దాన్ని ఫలితాన్ని బట్టి ఇంకొక సినిమా మొదలు పెడతారు. దేవుడు తనకి ఒక పక్క “సరిలేరు నీకెవ్వరు” మరియు “భారతీయుడు-2” ఒకేసారి చెయ్యాల్సిన పరిస్థితి ఇచ్చాడు.

అందులో రత్నవేలు గారు చేసింది ఏమి లేదు, భారతీయుడు పోస్ట్ పోన్ అవ్వడం వలన సరిలేరు నీకెవ్వరూ చేసేద్దాం అనుకున్నారు, మధ్యలో మళ్లీ భారతీయుడు వచ్చింది. అలా అవ్వడం నాకు మొదటి సారి అని రత్నవేలు గారు స్నేహితులతో అన్నారంటా.

అందుకే మనం కూడా ఇకనుంచి ఏదైనా సినిమా లేట్ అయితే ఇంత జరుగుతుందా? అని ఆలోచిద్దాము.