24 గంటల్లో…. సినిమా మీద ఇంటరెస్ట్ వస్తుంది!


Raagala 24 Gantallo
24 గంటల్లో…. సినిమా మీద ఇంటరెస్ట్ వస్తుంది!

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్స్ రోజు రోజుకి పెరిపోతున్నాయి. చూసుకుంటే అందులో హీరో-దర్శకుడు, హీరో-హీరోయిన్ ఇవే ముఖ్యం ఎందుకంటే ఒకసారి ఆ కాంబినేషన్స్ సక్సెస్ అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇవే కాంబినేషన్స్ రిపీట్ అయితే జనాలు ఆదరిస్తారు కాబట్టి.

ఇక అదే విషాయానికి వస్తే ఇప్పుడు ఒక సినిమా అలానే కొత్త కాంబినేషన్స్ తో తెగ హడావిడి చేస్తున్నారు. సినిమా పేరు “రాగాల 24 గంటల్లో ” … హీరో సత్యదేవ్, హీరోయిన్ ఈషా రెబ్బ, దర్శకుడుగా కామెడీ సినిమాల సృష్టికర్త శ్రీనివాస్ రెడ్డి, నిర్మాతగా శ్రీనివాస్ కన్నూరు, సంగీత దర్శకుడిగా రఘు కుంచె స్వరాలూ సమకూరుస్తున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 18 న విడుదల అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ ని 25 సెప్టెంబర్ న మీ ముందుకి రాబోతుంది అని పోస్టర్ ఒకటి ఫిలిం నగర్ లో రిలీజ్ చేసారు. సినిమా గురించి యూనిట్ అందరూ నమ్మకంగా ఉన్నారు అని ఆనందం వ్యక్తం చేసారు.

మరి ఇలాంటి కొత్త కాంబినేషన్ ఈ సంవత్సరంలో చాలానే ఉన్నాయి, వాటికి మనం ఇంకా మునుముందు అభివృద్ధి చేస్తూ, మన సపోర్ట్ అందించడం తెలుగు పరిశ్రమకి మంచిదే కదా అంటున్నారు సినిమా ప్రియులు.

Credit: Twitter