డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి రాశీఖ‌న్నా ఎంట్రీ..!


డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి రాశీఖ‌న్నా ఎంట్రీ..!
డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి రాశీఖ‌న్నా ఎంట్రీ..!

`ప్ర‌తీ రోజు పండ‌గే` వంటి హిట్ చిత్రం త‌రువాత తెలుగులో మ‌రో ఛాన్స్‌ని ద‌క్కించుకోలేక‌పోయింది రాశిఖ‌న్నా. కేవ‌లం త‌మిళ చిత్రాల‌కు ప‌రిమిత‌మైన రాశి త్వ‌ర‌లో డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్ షాహీద్ క‌పూర్‌తో క‌లిసి. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త‌మిళంలో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్న రాశిఖ‌న్నా అనూహ్యంగా డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ప్ర‌వేశిస్తోంది.

`ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీ‌మింగ్ అయిన `ది ఫ్యామిలీమ్యాన్‌` డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ డ్రామాతో రాజ్ అండ్ డీకే పాపుల‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం వీరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న `ది ఫ్యామిలీ మ్యాన్ 2`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌నోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్న ఈ సీక్వెల్‌లో స్టార్ హీరోయిన్ స‌మంత అత్యంత కీల‌క పాత్ర‌లో టెర్ర‌రిస్టుగా క‌నిన‌పించ‌బోతోంది.

వీరు త్వ‌ర‌లో ఓ ఓటీటీ ఒరిజిన‌ల్‌ని రూపొందించ‌బోతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో షాహీద్ క‌పూర్ న‌టిస్తుండ‌గా అత‌నికి జోడీగా రాశిఖ‌న్నా న‌టిస్తున్న‌ట్టు సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ హ్యాండీల్ ద్వారా వెల్ల‌డించింది. షాహీద్ క‌పూర్‌తో క‌లిసి తీసుకున్న సెల్ఫీని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి సైలెంట్ ఎమోజీని షేర్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌న్న విష‌యాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.