నాలుగు సినిమాలపై ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నా


Raashi Khanna
నాలుగు సినిమాలపై ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా చాలా త్వరగా లైమ్ లైట్ లోకి వచ్చింది. జిల్, సుప్రీమ్ వంటి సినిమాలతో నోటెడ్ హీరోయిన్ అయిపోయింది. జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ తో సైతం నటించింది. అయితే ఎందుకనో రాశి కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. మరోవైపు ఆమె కన్నా వెనక వచ్చిన వారు వరసగా సినిమాలు చేస్తూ టాప్ స్థాయికి చేరుకుంటున్నారు.

అందుకే రాశి రేసులో వెనకపడకూడదని వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్, సాయి ధరమ్ తేజ్ పక్కన ప్రతిరోజూ పండగే చిత్రాల్లో నటిస్తోంది రాశి. ఈ సినిమాలు హిట్ అయితే వరసగా అవకాశాలు క్యూ కడతాయని భావిస్తోంది. ఇక తమిళ్ లో కూడా రాశి విజయ్ సేతుపతి సరసన తంగా తమిళన్, మరో సినిమా సైతాన్ కా బచ్చా చేస్తోంది.

అటు తెలుగులోనూ, ఇటు తమిళ్ లోనూ వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోవాలని మాస్టర్ స్కెచ్ వేసింది రాశి. మరి ఆమె ఆశలు ఏ మేరకు నెరవేరతాయో చూడాలి.