విజయ్ దేవరకొండ ని రిజెక్ట్ చేసిన రాశి ఖన్నా


raashi khanna rejected vijay devarakonda గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి నిరాకరించి పెద్ద తప్పు చేసింది రాశి ఖన్నా . అదే సమయంలో దిల్ రాజు నిర్మిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నితిన్ సరసన నటించింది అయితే శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9న విడుదలై ప్లాప్ అయిన విషయం తెలిసిందే కట్ చేస్తే ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది దాంతో కుమిలిపోవడం రాశి ఖన్నా వంతయ్యింది .

గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించమని ఒక్క రాశి ఖన్నా ని మాత్రమే కాదు దాదాపు 20 మంది హీరోయిన్ లను అడిగారట ! అయితే ఒక్కరు కూడా అందుకు ఒప్పుకోలేదు అందుకు ఒక కారణం అప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో కాదు దానికి తోడు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఒప్పుకోలేదు అయితే రాశి ఖన్నా మాత్రం నటించడానికి ఒప్పుకుందట కానీ కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తానని గట్టిగా పట్టుబట్టిందట దాంతో రాశి ఖన్నా కు అంత పెద్ద మొత్తం ఎందుకివ్వాలి అని రేష్మిక ని తీసుకున్నారు కట్ చేస్తే శ్రీనివాస కళ్యాణం ప్లాప్ అయ్యింది గీత గోవిందం చిత్రం హిట్ అయ్యింది దాంతో పాపం బాధపడుతుందట రాశి ఖన్నా

English Title: raashi khanna rejected vijay devarakonda