రాజమండ్రి లో మాకు రోజు పండగే..


Sai Dharam Tej And Raashi Khanna
రాజమండ్రి లో మాకు రోజు పండగే..

“సాయి ధరమ్ తేజ్” తో జంటగా “రాశి ఖన్నా” గారు నటిస్తున్న సినిమా “ప్రతిరోజూ పండగే”, సినిమాకి “మారుతి దాసరి” గారు దర్శకత్వం చేస్తున్నారు. మరి ఈ రోజు ఒక సాంగ్ షూటింగ్ జరిగిందేమో? లేక ఇంపార్టెంట్ సీన్ ఏమైనా జరిగిందో? లొకేషన్లో హీరో-హీరోయిన్ ఇద్దరు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు, ఆ ఫోటో ని రాశి ఖన్నా గారు పోస్ట్ చేశారు.

రాశి ఖన్నా ట్విట్టర్ లో.. “నాకు ఇష్టమైన వారిలో నా స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు అతనితో నా సినిమా ‘ ప్రతిరోజూ పండగే’ షూటింగ్ అందమైన ప్రదేశం అయిన రాజమండ్రి లో జరుగుతుంది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ” అని పోస్ట్స్ చేసారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే అల్లుఅరవింద్ గారి సమర్పణలో బన్నీవాస్ గారు ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘జిఏ 2 పిక్చర్స్’ వాళ్ళతో కలిపి సంయుక్తం గా భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకులుగా యువ సంచలనం థమన్.ఎస్ పాటలకి జీవం పోస్తున్నారు.

ఈ సినిమా తాత-మనువల్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందని రీసెంట్ గా విడుదల చేసిన కొత్త పోస్టర్ ని చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మొత్తానికి డిసెంబర్ లో డేట్ ఇంకా ఫిక్స్ గాని ఈ సినిమాకి కుటుంబ ప్రజలు కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండొచ్చు అంటున్నారు సినీమా ప్రియులు. సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా మంచి పెయిర్ అని “సుప్రీమ్” సినిమా ద్వారా మనం చూసాం. ఈ సారి ఏ విధంగా మనలని అలరిస్తారో చూద్దాం.

Credit: Twitter