ఆ ఇద్ద‌రిపై మ‌ళ్లీ నిప్పులు చెరిగిన చిన్మ‌యి!‌

ఆ ఇద్ద‌రిపై మ‌ళ్లీ నిప్పులు చెరిగిన చిన్మ‌యి!‌
ఆ ఇద్ద‌రిపై మ‌ళ్లీ నిప్పులు చెరిగిన చిన్మ‌యి!‌

మీటూ ఉద్య‌మం బాలీవుడ్‌ని కుదిపేసిన త‌రువాత గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద కోలీవుడ్ సెల‌బ్రిటీల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తు కొత్త‌గా ఫీల్డ్‌లోకి ఎంట‌రైన యువ గాయ‌నిల‌ని వేధించార‌ని, అందులో తాను కూడా వున్నాన‌ని చిన్మియి చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ ఇండస్ట్రీలో అప్ప‌ట్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. ఈ వ్యాఖ్య‌ల‌తో చిన్మ‌యి వార్త‌ల్లో నిలిచింది.

ఆ త‌రువాత కూడా ఆమె డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ప్రెసిడెంట్ రాధార‌విపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం, దానికి కౌంట‌ర్‌గా  న‌టుడు రాధార‌వి కూడా చన్మ‌యిపై విరుచుకుప‌డ‌టం, అది వివాదానికి దారితీయ‌డం, ఆ త‌రువాత చిన్మయిని డ‌బ్బింగ్ అండ్ సింగ‌ర్స్ యూనియ‌న్ నుంచి బ్యాన్ చేయ‌డం వ‌ర‌కు వెళ్లింది. దీనిపై చిన్మయి కోర్టులో స‌వాల్ చేయ‌డం తెలిసింది.

ఇదే విష‌యాన్ని చిన్మయి మ‌రోసారి `ఇండియా టుడే కాన్‌క్లేవ్‌`లో వెల్ల‌డించింది. 2018 నుంచి త‌న‌ని వైర‌ముత్తు, రాధార‌వి కోలీవుడ్ నుంచి బ్యాన్ చేశార‌ని, అప్ప‌టి నుంచి త‌ను న్యాయ‌పోరాటం చేస్తున్నాన‌ని తెలిపింది చిన్మ‌యి. అంతే కాకుండా త‌న‌ని అర్థం చేసుకునే భ‌ర్త‌, కుటుంబం వుండటం త‌న అదృష్ట‌మ‌ని, అలా లేని వాళ్ల ప‌రిస్థితేంట‌ని ఈ సంద‌ర్భంగా చిన్మ‌యి ప్ర‌శ్నించింది.