రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ కు కన్ఫ్యూజన్ ఎందుకు?

రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ కు కన్ఫ్యూజన్ ఎందుకు?
రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ కు కన్ఫ్యూజన్ ఎందుకు?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా సినిమా రాధే శ్యామ్. ఇది ఒక పీరియాడిక్ లవ్ డ్రామా అన్న విషయం ఇప్పటికే రివీల్ అయింది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో మొదలవుతుందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. అయినా ఇప్పుడు సెప్టెంబర్ ఆఖరి వారంలోకి వచ్చేసాం. అయినా కూడా ఎందుకని రాధే శ్యామ్ షూట్ మొదలవలేదు?

రాధే శ్యామ్ షూట్ ను మొదట హైదరాబాద్ లోని స్పెషల్ సెట్ లో షూట్ చేద్దామనుకున్నారు. అయితే ప్రస్తుతం కేసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బాగానే నమోదవుతున్నాయి. అందుకే ఆ ప్లాన్ ను రాధే శ్యామ్ టీమ్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా ఇటలీలో రాధే శ్యామ్ షూట్ ను షూట్ చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్లాన్ కు స్టిక్ అయ్యారు. త్వరలోనే ఇటలీ షెడ్యూల్ మొదలవుతుంది. అక్కడ దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ ను నిర్వహించనున్నారు.

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.