రాధే శ్యామ్ కు పూజ హెగ్డే అడ్డంకిగా మారిందా?


రాధే శ్యామ్ కు పూజ హెగ్డే అడ్డంకిగా మారిందా?
రాధే శ్యామ్ కు పూజ హెగ్డే అడ్డంకిగా మారిందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే పూర్తి కావాల్సి ఉంది. డిసెంబర్ ఎండింగ్ కు రాధే శ్యామ్ షూటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు కానీ అది జరగలేదు. ఇంకా కొంత మేర షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దీనికి ప్రధాన కారణం పూజ హెగ్డే అంటున్నారు.

ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ను ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం పూజ హెగ్డే హిందీలో సినిమాలు చేస్తోంది. రన్వీర్ సింగ్ తో ఒక సినిమా, సల్మాన్ ఖాన్ తో మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ అమ్మడు. ఈ సినిమాలకు తొలుత డేట్స్ ఇచ్చేసిన పూజ హెగ్డే, రాధే శ్యామ్ ను పెండింగ్ లో పెట్టిందిట.

ముందు అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు కూడా ఈ కష్టాలు వెంటాడాయి. అయితే ఎలాగోలా వాటిని పూర్తి చేసింది పూజ. మరి రాధే శ్యామ్ కు ఎప్పుడు మోక్షం కలిగిస్తుందోనని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.