డబ్బు కోసమే ఆ పని చేశానంటున్న బోల్డ్ హీరోయిన్


Radhika Apte
Radhika Apte

సెన్సేషనల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రాధికా ఆప్టే అవసరాన్ని బట్టి న్యూడ్ సీన్లలో కూడా నటించింది. దాంతో పాటే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే, కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో తన గొంతుకను గట్టిగానే వినిపించింది. రాధికా బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా తన పాత్రలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ఇటీవలే ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాధికా ఆప్టే కొన్ని ఆసక్తికర సంగతులను వెల్లడించింది. కెరీర్ మొదట్లో తనకు ఎక్కువ రోల్స్ వచ్చేవి కావని, డబ్బులు కూడా తక్కువ వచ్చేవని, అందుకోసమే తను బోల్డ్ రోల్స్ వేశానని, న్యూడ్ గా కనిపించానని వెల్లడించింది.

ఇంత బోల్డ్ గా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. చాలా మంది పాత్ర డిమాండ్ చేసినందుకే తాము బోల్డ్ రోల్స్ వేశామని చెప్తుంటారు.